వేములవాడలో పోటెత్తిన భక్తులు

వేములవాడ (కరీంనగర్‌) : కార్తీక మాసం సందర్బంగా వేములవాడలోని శ్రీ రాజరాజశ్వరీ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులకు దర్శనానికి ఆరు గంటలు ,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. భక్తులకు సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.