రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
కరీంనగర్ : జిల్లాలోని కోరుట్ల మండలం మోహన్రావు పేట వద్ద ప్రమాదం జరిగింది. ఆర్టీసీబస్సు-బైక్ను ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.