ప్రతిభ తన బహుమతులను రాష్ట్రపతి భవన్‌కు అందజేశారు.
ఢిల్లీ: ప్రతిభాపాటిల్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు లభించిన అధికారిక బహుమతులన్నిటినీ తిరిగి రాష్ట్రపతి భవన్‌కు అందజేశారని అధికారులు తెలిపారు. సహ చట్టం కింద సుభాష్ అగర్వాల్ అనే కార్యకర్త అడిగిన ప్రశ్నకు అధికారులు సమాధానం ఇచ్చారు. ప్రతిభాపాటిల్‌కు 155 బహుమతులు వచ్చాయని వాటిని అమరావతిలోని విద్యాభారతి శైక్షణిక్ మందై పాఠశాలలో ప్రదర్శన కోసం రాష్ట్రపతి భవన్ తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకుందని అధికారులు తెలిపారు. అలాగే కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అందుకున్నప్పుడు అందుకున్న 36 బహుమతులు తొలుత డీఆర్‌డీవోలో ప్రదర్శనకు ఉంచినా తిరిగి వాటిని రాష్ట్రపతి భవన్‌కు అందజేశారని రాష్ట్రపతి భవన్ అధికారులు తెలిపారు.