రాయ్‌బరేలీలో సోనియాగాంధీ పర్యటన
రాయ్‌బరేలీ: సొంత పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ రోజు సలు అబివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ రోజు ఉదయం రాయ్‌బరేలీ చేరుకున్న ఆమె ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కిందనిర్మించనున్న 50 రహదారులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. నియోజక వర్గంలోని వివిధ గ్రామాలను కలుపుతూ ఈ రోడ్లను నిర్మిస్తున్నారు. సరాయ్‌ముగ్లాలో నీటి శుద్ధి ప్లాంటును కూడా ఆమె ప్రారంభించారు. రాయ్‌బరేలీ-మహరాజ్ గంజ్-అక్బర్ గంజ్‌ల మధ్య నిర్మించనున్న రైలు మార్గానికి కూడా ఈ రోజు ఆమె పునాది రాయి వేయనున్నారు. ఆకాశవాణి కార్యాలయంలో ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌ను కూడా సోనియా గాంధీ ప్రారంభించనున్నారు.