ఇక మార్కెట్ ధరలు ఎస్ ఎంఎస్.
కాశీబుగ్గ: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో క్రయవిక్షికయాలు జరిగే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఇకనుంచి రైతులకు, వ్యాపారులకు, సంబంధిత అధికారులకు ఎస్ ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తున్నట్లు మార్కెట్ ఛైర్మన్ మంద వినోద్ కుమార్ తెలిపారు. మార్కెట్ ప్రధాన కార్యాలయంలోని కంప్యైటర్ విభాగంలో ఛైర్మన్ వినోద్, ఉన్నతక్షిశేణి కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ మంగళవారం రైతులకు ఎస్ ఎంఎస్ ద్వారా వివరాలను పంపారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఇక నుంచి అందరికి సెల్‌ఫోన్ లో సమాచారం అందిస్తామని వారు తెలిపారు. రైతులు, వ్యాపారులు, సంబంధిత అధికారుల సెల్ నెంబర్లు మార్కెట్ కార్యాలయంలోని కంప్యూటర్ విభాగంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.