రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతతో వైట్‌ఫీల్డ్‌లో ఉద్రిక్తత
బెంగళూరు: వేగంగా వచ్చిన వ్యాన్ ట్యాంకర్ మోటార్ సైకిల్‌ను ఢీకొనడంతో ధనుశ్రీ అనే మూడేళ్ల చిన్నారి బైక్‌పై నుంచి కిందపడిపోయింది. ఆమె మీదుగా ట్యాంకర్ చక్రాలు వెళ్లడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనతో కోపోద్రిక్తులైన ప్రజలు రహదారిని దిగ్బంధించి ట్యాంకర్‌కు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. దాంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బెంగళూరు శివారులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.