పాక్‌ బాలిక మలాలాకు ఐరాస మానవ హక్కుల అవార్డు

ఐరాస: బాలికల విద్యను ప్రోత్సహించినందుకు తాలిబన్లదాడికి గురై, ధైర్యంగా నిలిచి తాను నమ్మిన బాటలో ముందుకు సాగుతున్న పాకిస్థాన్‌కు చెందిన సాహస బాలిక మలాలా యూసుఫ్‌ జాయ్‌ మరో ప్రతిష్ఠాత్మక అవార్డు గెలుచుకుంది. 2013 ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల అవార్డును మలాలాకు అందజేస్తున్నట్లు మానవహక్కుల శాఖ కార్యాలయ హై కమిషనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఐదేళ్లకోసారి ఇచ్చే ఈ అవార్డును గతంలో నెల్సన్‌ మండేలా, జిమ్మీ కార్టర్‌ లాంటి ప్రముఖులు అందుకున్నారు. మలాలాతో పాటు మరో ఐదుగురు ఈ అవార్డు గెలుచుకున్నారు. డిసెంబర్‌ 10న సమితి ప్రధాన కార్యాలయం వద్ద జరిగే ఇక కార్యక్రమంలో అవార్డులను ప్రధానం చేస్తారు.