రికార్డు స్థాయిలో స్టాక్ మారెట్లు
ముంబయి: సోమవారం భారతీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా విజయం సాధించడమే మార్కెట్ల జోరుకు కారణమని భావిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బీఎన్‌ఈ సెన్సెక్స్ 333 పాయింట్ల లాభంతో 21,330 వద్ద, నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 6,363 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 61.07 ఉంది.