విశాఖలో సమైక్యవాదుల నిరసన

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో సమైక్యవాదుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలుగు జాతి విద్రోహ దినంగా పేర్కొంటూ నగరంలో ఏపీఎన్జీవోలు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద జూడాలు నిరసనలు తెలిపారు. ఎమ్మెల్యే వెలగపూడి ఆధ్వర్యంలో తెదేపా కార్యకర్తలు ద్విచక్రమవాహన ర్యాలీ నిర్వహించారు. జగదాంబ కూడలిలో సమైక్యవాదులు మానవహారం చేపట్టారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని సమైక్యవాదులు స్పష్టం చేశారు.