మేం సమైక్యాంధ్రప్రదేశ్‌కు అనుకూలం: మమతా బెనర్జీ
ఢిల్లీ: తాము సమైక్యాంధ్ర ప్రదేశ్‌కు అనుకూలమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… నాలుగు రాష్ట్రాల్లో విజయం వ్యక్తిగతం కాదు, కాంగ్రెస్ వ్యతిరేక శక్తుల గెలుపు అని వ్యాఖ్యానించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి వంట గదిలో మంట మండుతోందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రాంతాయ పార్టీల సమయం ఆసన్నమైందని, ఈ పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీల మధ్య సఖ్యత అవసరమని వివరించారు.