లోక్‌పాల్ ఆమోదానికి ప్రభుత్వం సిద్ధం: నారాయణ స్వామి
ఢిల్లీ: లోక్‌పాల్ బిల్లు ఆమోదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని కార్యాలయాల వ్యవహారాల మంత్రి నారాయణ స్వామి స్పష్టం చేశారు. పార్లమెంట్ వద్ద మంత్రి మీడియాతో మాట్లాదుతూ..లోక్‌పాల్ బిల్లు అంశాన్ని చేపట్టాల్సిందిగా రాజ్యసభాధ్యక్షుడికి తాను నోటీసు ఇచ్చినట్లు చెప్పారు. తర్వాత అది సెలక్ట్ కమిటీ పరిశీలనకు వెళ్లగా.. వారు చేసిన కొన్ని సిఫార్సులను ఆమోదించామని చెప్పారు. సమగ్ర చర్చ అనంతరం బిల్లు ఆమోదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నారాయణ స్వామి వివరించారు. ఈ దశలో అన్నా హజారే దీక్ష ప్రారంభించారని, అయితే ప్రభుత్వం బిల్లు ఆమోదం పొందాలనే భావిస్తోందని, అందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు వెల్లడించారు.