ట్రైబునల్ తీర్పుతో రాష్ట్రానికి రెండు రకాలుగా నష్టం: జేపీ
హైదరాబాద్: బ్రిజేస్ కుమార్ ట్రైబునల్ తీర్పుతో రాష్ట్రం రెండు రకాలుగా నష్టపోయిందని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ట్రైబునల్ తీర్పుపై సచివాలయంలో ముఖ్యమంత్రి తీర్పుతో జరిగిన అఖఙల పక్ష భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుతో వివరణలు, సూచనలు తప్ప మరేమీ లేవని, 75 శాతం నుంచి 65 శాతానికి తగ్గించి నీళ్ళు కేటాయించారని జేపీ అన్నారు. దిగువ రాష్ట్రం కనుక మనకు ఎక్కువ నీళ్లు కేటాయించాలని ఆయన పేర్కొన్నారు.