గతంలో చేసిన తీర్మానం ఏమైంది బాబు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును మీరు అసెంబ్లీలో ప్రవేశపెడతారా? మమ్మల్ని ప్రైవేటు తీర్మానం పెట్టమంటారా? అంటూ 2009 డిసెంబర్‌ 6న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యను ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు నిలదీశాడు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తున్నామని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తాము సుముఖంగా ఉన్నామని పేర్కొన్నారు. అంతేకాదు హైదరాబాద్‌ నగరం తెలంగాణకే చెందుతుందని కూడా చెప్పాడు. తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ మహానాడులో తీర్మానం చేసిందని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రంలోని ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ కూడా ఇచ్చిందని చెప్పాడు. ఆ లేఖకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నాడు. ఆ మరుసటి రోజు రోశయ్య నేతృత్వంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అవే విషయాలు చెప్పారు. ఈ సమావేశం తీర్మానాన్ని ఆధారంగా చేసుకొని డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు తెలంగాణ ఏర్పాటు చేయమని డిమాండ్‌ చేసిన చంద్రబాబు ఉన్నట్టుండి తన పంథా మార్చుకున్నారు. ఎవరిని అడిగి తెలంగాణ ప్రకటించారని కేంద్రాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన కీలక నిర్ణయం అర్ధరాత్రి ప్రకటిస్తారా అంటూ నాలుక మడతేశాడు. అంతటితో ఆగకుండా తన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలను పోగేసి వారితో వరుసపెట్టి రాజీనామాలు చేయించాడు. తెలంగాణపై చంద్రబాబు అడ్డం తిరిగిన తర్వాతే సీమాంధ్రకు చెందిన మిగతా పార్టీల నాయకులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు దిగారు. అంతకు మూడు రోజుల ముందే అసెంబ్లీ నిండు సభలో ఏం మాట్లాడారో తెలియనంతగా ఒళ్లు మరిచి రెచ్చిపోయాడు చంద్రబాబు. ఆ రోజు మొదలు కేంద్రం తెలంగాణపై ఎప్పుడు సానుకూలంగా ముందడుగు వేసినా అడ్డగోలు రాజకీయాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడో దూరమైన అధికారం ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలనే లక్ష్యంతో వస్తున్న మీకోసం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టిన చంద్రబాబును తెలంగాణ ప్రజలు అడుగడుగునా అడ్డుకున్నారు. తెలంగాణ ఓట్లు, సీట్లు సాధించకుండా అధికారం కల్ల అని గుర్తించి తెలంగాణపై ప్రణబ్‌ కమిటీ ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని, కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశాడు. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అఖిలపక్షం నిర్వహిస్తే అది తమ పార్టీ ఘనతాగానే చెప్పుకున్నాడు. టీ టీడీపీ నేతలతో పదే పదే చెప్పించాడు. 2012 డిసెంబర్‌ 28న షిండే నేతృత్వంలో నిర్వహించిన అఖిలపక్షం తర్వాత కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశంపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ తదితర ప్రక్రియలో నిమగ్నమైంది. యూపీఏ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానిస్తూ ఈ మేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో ఆగస్టులో కేంద్రం ఇందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ ప్రారంభించింది. అది మొదలు చంద్రబాబు మళ్లీ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. తమిళులు, కన్నడీగులు కుట్రపన్ని దక్షిణ భారతదేశంలో పెద్దదైన ఆంధ్రప్రదేశ్‌ విభజనకు పూనుకున్నారని దుమ్మెత్తిపోశారు. ప్రజాక్షేత్రంలో గెలవలేని వారు ఆంధ్రప్రదేశ్‌ను ఎలా విభజిస్తారంటూ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంపై పరోక్ష విమర్శలు గుప్పించాడు. కేంద్రం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ విభజనకు పూనుకుందని ఆరోపణలు గుప్పించాడు. ఇరు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనే వరకు రాష్ట్ర విభజనను ఆపాలని కొత్త పల్లవి అందుకున్నాడు. తెలుగుజాతిని ఇబ్బందులకు గురిచేసిన వారు పుట్టగతులు లేకుండా పోయారని శాపనార్థాలు పెట్టాడు. ఢిల్లీలో దొంగ దీక్ష చేసిన జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక పరువు తీసుకున్నాడు. ప్రజలకు సమన్యాయం చేయాలని డిమాండ్‌ చేశాడు. దానికి అర్థమెంటో చెప్పమంటే మాత్రం స్పందించడు. తెలంగాణ ప్రజలు హైదరాబాద్‌, పది జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్ని మాత్రమే కోరుకున్నారు. ఇందుకోసం 2009 నుంచి ఇప్పటి వరకు 11 వందల మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ సాధన కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఉద్యమంలోనే ఉన్నారు. వీటిని గుర్తించిన కేంద్రం ప్రజల డిమాండ్‌ మేరకు పది జిల్లాలు, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇచ్చేందుకే మొగ్గుచూపింది. ఇంకా తెలంగాణ ప్రజలకు సమన్యాయమంటే ఏమిటి? దీనికి టీ టీడీపీ నేతలుగానీ, చంద్రబాబుగానీ అర్థం చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు మళ్లీ అదేపాట పాడుతున్నాడు. రాష్ట్ర విభజన ప్రక్రియలో హేతుబద్ధత లోపించిందని అన్నాడు. రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజాప్రయోజనాలు లేవని ఆరోపణలు గుప్పించాడు. హైదరాబాద్‌పై, ఇక్కడి నుంచి వచ్చే ఆదాయంపై స్పష్టత లేదని అన్నాడు. ఏ ప్రాంతానికి చెందిన విద్యుత్‌ ప్రాజెక్టులు ఆప్రాంతానికే చెందాలని, అలాంటప్పుడు తెలంగాణలోని ఎత్తిపోతల పథకాలకు ఎక్కడి నుంచి కరెంట్‌ తెస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్‌పై ఆంక్షలను ప్రస్తావించకుండా ఇక్కడి ఆదాయంపై ప్రశ్నలు గుప్పించి, సీమాంధ్రులకు న్యాయం చేయాలనే అర్థం ధ్వనించేలా మాట్లాడాడు. చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో క్రియాశీల భూమిక పోషించాల్సి ఉండగా, తన బాధ్యతను విస్మరించి ఒక ప్రాంతం పక్షం వహించాడు. పైకి తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో కీలకమైన సమస్యల పరిష్కారానికి కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి కనీసం సమాచారం ఇవ్వకుండా, అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకుండా తన రాజకీయ దిగజారుడుతనాన్ని చాటుకున్నాడు. గతంలో తెలంగాణకు మద్దతు ప్రకటించినప్పుడు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరినప్పుడు బాబుకు ఈ విషయాలు గుర్తులేదా? తెలంగాణ ఇవ్వమని కోరితే చాలు కేంద్రం ఇస్తుందా? అనే అతివిశ్వాసంతో ముందు ప్రకటనలు చేసి ఇప్పుడు అడుగడుగునా తెలంగాణకు అడ్డుతగలడం నిజం కాదా? ఇంత దారుణంగా వ్యవహరిస్తూనే ఈ ప్రాంత ప్రజల ఓట్లు దండుకోవాలని టీ టీడీపీని రంగంలో ఉంచడం చంద్రబాబకు మాత్రమే చెల్లింది. నాలుగు దశాబ్దాల పోరాటం నిజమయ్యే వేళ చంద్రబాబు, సీమాంధ్ర పెత్తందారులతో కలిసి చేస్తున్న అడ్డుపుల్ల రాజకీయాలను ప్రజలు గుర్తిస్తూనే ఉన్నారు. ఇందుకు సరైన రీతిలో బదులిచ్చి తీరుతారు.గతంలో చేసిన తీర్మానం ఏమైంది బాబు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును మీరు అసెంబ్లీలో ప్రవేశపెడతారా? మమ్మల్ని ప్రైవేటు తీర్మానం పెట్టమంటారా? అంటూ 2009 డిసెంబర్‌ 6న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యను ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు నిలదీశాడు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తున్నామని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తాము సుముఖంగా ఉన్నామని పేర్కొన్నారు. అంతేకాదు హైదరాబాద్‌ నగరం తెలంగాణకే చెందుతుందని కూడా చెప్పాడు. తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ మహానాడులో తీర్మానం చేసిందని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రంలోని ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ కూడా ఇచ్చిందని చెప్పాడు. ఆ లేఖకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నాడు. ఆ మరుసటి రోజు రోశయ్య నేతృత్వంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అవే విషయాలు చెప్పారు. ఈ సమావేశం తీర్మానాన్ని ఆధారంగా చేసుకొని డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు తెలంగాణ ఏర్పాటు చేయమని డిమాండ్‌ చేసిన చంద్రబాబు ఉన్నట్టుండి తన పంథా మార్చుకున్నారు. ఎవరిని అడిగి తెలంగాణ ప్రకటించారని కేంద్రాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన కీలక నిర్ణయం అర్ధరాత్రి ప్రకటిస్తారా అంటూ నాలుక మడతేశాడు. అంతటితో ఆగకుండా తన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలను పోగేసి వారితో వరుసపెట్టి రాజీనామాలు చేయించాడు. తెలంగాణపై చంద్రబాబు అడ్డం తిరిగిన తర్వాతే సీమాంధ్రకు చెందిన మిగతా పార్టీల నాయకులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు దిగారు. అంతకు మూడు రోజుల ముందే అసెంబ్లీ నిండు సభలో ఏం మాట్లాడారో తెలియనంతగా ఒళ్లు మరిచి రెచ్చిపోయాడు చంద్రబాబు. ఆ రోజు మొదలు కేంద్రం తెలంగాణపై ఎప్పుడు సానుకూలంగా ముందడుగు వేసినా అడ్డగోలు రాజకీయాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడో దూరమైన అధికారం ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలనే లక్ష్యంతో వస్తున్న మీకోసం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టిన చంద్రబాబును తెలంగాణ ప్రజలు అడుగడుగునా అడ్డుకున్నారు. తెలంగాణ ఓట్లు, సీట్లు సాధించకుండా అధికారం కల్ల అని గుర్తించి తెలంగాణపై ప్రణబ్‌ కమిటీ ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని, కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశాడు. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అఖిలపక్షం నిర్వహిస్తే అది తమ పార్టీ ఘనతాగానే చెప్పుకున్నాడు. టీ టీడీపీ నేతలతో పదే పదే చెప్పించాడు. 2012 డిసెంబర్‌ 28న షిండే నేతృత్వంలో నిర్వహించిన అఖిలపక్షం తర్వాత కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశంపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ తదితర ప్రక్రియలో నిమగ్నమైంది. యూపీఏ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానిస్తూ ఈ మేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో ఆగస్టులో కేంద్రం ఇందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ ప్రారంభించింది. అది మొదలు చంద్రబాబు మళ్లీ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. తమిళులు, కన్నడీగులు కుట్రపన్ని దక్షిణ భారతదేశంలో పెద్దదైన ఆంధ్రప్రదేశ్‌ విభజనకు పూనుకున్నారని దుమ్మెత్తిపోశారు. ప్రజాక్షేత్రంలో గెలవలేని వారు ఆంధ్రప్రదేశ్‌ను ఎలా విభజిస్తారంటూ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంపై పరోక్ష విమర్శలు గుప్పించాడు. కేంద్రం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ విభజనకు పూనుకుందని ఆరోపణలు గుప్పించాడు. ఇరు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనే వరకు రాష్ట్ర విభజనను ఆపాలని కొత్త పల్లవి అందుకున్నాడు. తెలుగుజాతిని ఇబ్బందులకు గురిచేసిన వారు పుట్టగతులు లేకుండా పోయారని శాపనార్థాలు పెట్టాడు. ఢిల్లీలో దొంగ దీక్ష చేసిన జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక పరువు తీసుకున్నాడు. ప్రజలకు సమన్యాయం చేయాలని డిమాండ్‌ చేశాడు. దానికి అర్థమెంటో చెప్పమంటే మాత్రం స్పందించడు. తెలంగాణ ప్రజలు హైదరాబాద్‌, పది జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్ని మాత్రమే కోరుకున్నారు. ఇందుకోసం 2009 నుంచి ఇప్పటి వరకు 11 వందల మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ సాధన కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఉద్యమంలోనే ఉన్నారు. వీటిని గుర్తించిన కేంద్రం ప్రజల డిమాండ్‌ మేరకు పది జిల్లాలు, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇచ్చేందుకే మొగ్గుచూపింది. ఇంకా తెలంగాణ ప్రజలకు సమన్యాయమంటే ఏమిటి? దీనికి టీ టీడీపీ నేతలుగానీ, చంద్రబాబుగానీ అర్థం చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు మళ్లీ అదేపాట పాడుతున్నాడు. రాష్ట్ర విభజన ప్రక్రియలో హేతుబద్ధత లోపించిందని అన్నాడు. రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజాప్రయోజనాలు లేవని ఆరోపణలు గుప్పించాడు. హైదరాబాద్‌పై, ఇక్కడి నుంచి వచ్చే ఆదాయంపై స్పష్టత లేదని అన్నాడు. ఏ ప్రాంతానికి చెందిన విద్యుత్‌ ప్రాజెక్టులు ఆప్రాంతానికే చెందాలని, అలాంటప్పుడు తెలంగాణలోని ఎత్తిపోతల పథకాలకు ఎక్కడి నుంచి కరెంట్‌ తెస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్‌పై ఆంక్షలను ప్రస్తావించకుండా ఇక్కడి ఆదాయంపై ప్రశ్నలు గుప్పించి, సీమాంధ్రులకు న్యాయం చేయాలనే అర్థం ధ్వనించేలా మాట్లాడాడు. చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో క్రియాశీల భూమిక పోషించాల్సి ఉండగా, తన బాధ్యతను విస్మరించి ఒక ప్రాంతం పక్షం వహించాడు. పైకి తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో కీలకమైన సమస్యల పరిష్కారానికి కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి కనీసం సమాచారం ఇవ్వకుండా, అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకుండా తన రాజకీయ దిగజారుడుతనాన్ని చాటుకున్నాడు. గతంలో తెలంగాణకు మద్దతు ప్రకటించినప్పుడు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరినప్పుడు బాబుకు ఈ విషయాలు గుర్తులేదా? తెలంగాణ ఇవ్వమని కోరితే చాలు కేంద్రం ఇస్తుందా? అనే అతివిశ్వాసంతో ముందు ప్రకటనలు చేసి ఇప్పుడు అడుగడుగునా తెలంగాణకు అడ్డుతగలడం నిజం కాదా? ఇంత దారుణంగా వ్యవహరిస్తూనే ఈ ప్రాంత ప్రజల ఓట్లు దండుకోవాలని టీ టీడీపీని రంగంలో ఉంచడం చంద్రబాబకు మాత్రమే చెల్లింది. నాలుగు దశాబ్దాల పోరాటం నిజమయ్యే వేళ చంద్రబాబు, సీమాంధ్ర పెత్తందారులతో కలిసి చేస్తున్న అడ్డుపుల్ల రాజకీయాలను ప్రజలు గుర్తిస్తూనే ఉన్నారు. ఇందుకు సరైన రీతిలో బదులిచ్చి తీరుతారు.