అవినీతి, ధరల పెరుగుదలపైనే అవిశ్వాపం నోటీసు : తెదేపా
న్యూఢిల్లీ: అవినీతి, దేశభద్రత, ధరల పెరుగుదల పైనే అవిశ్వాసం నోటీసు ఇచ్చినట్లు తెదేపా ఎంపీ కొనకళ్ళ నారాయణ తెలిపారు. పార్లమెంట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ… సభ సజావుగా జరగాల్సిన బాధ్యత స్పీకర్‌దేనని, ఇప్పటికైనా స్పందించి అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చుశారు. మరో ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ…సభను నిర్వహించాలన్న ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదన్నారు. సభ వాయిదా పడితే తాము బతికి బయట పడతామని ప్రభుత్వం భావిస్తోందన్నారు.