సింగపూర్ అల్లర్లలో మరో ముగ్గురు భారతీయుల అరెస్ట్
సింగపూర్: ఆదివారం నాడు సింగపూర్‌లోని లిటిల్ ఇండియా ప్రాంతంలో జరిగిన అల్లర్లకు బాధ్యులుగా భావిస్తున్న మరో ముగ్గురు భారత పౌరుల్ని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి సోమవారం 24 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వారందరినీ ఇప్పటికే రిమాండ్‌కు పంపారు. వీరంతా కూడా వర్క్ పర్మిట్‌తో సింగపూర్ వెళ్లినవారే. గత 40 ఏళ్లలో ఇంత తీవ్రస్థాయిలో సింగపూర్‌లో అల్లర్లు జరగడం ఇదే ప్రథమం. నిందితులపై ఆరోపణలు రుజువైతే ఏడేళ్ల జైలుశిక్షతో పాటు బహఙరంగంగా బెత్తం దెబ్బల శిక్ష కూడా పడవచ్చని భావిస్తున్నారు. డిసెంబర్ 17న ఈ కేసు విచారణ జరగనుంది.