రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధర రాజే ప్రమాణ స్వీకారం
జైపూర్ : రాజస్ధాన్ ముఖ్యమంత్రిగా వసుంధర రాజే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ మార్గరెట్ అల్వా వసుంధర రాజేతో ప్రమాణ స్వీకారం చేయించారు. జైపూర్‌లో జరిగగిన ఈ కార్యక్రమానికి భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ, ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.