ఇంధన పొదుపుపై గృహిణులకు అవగాహన కార్యక్రమాలు : నెడ్‌క్యాప్‌ ఎండీ కమలాకర్‌ బాబు

హైదరాబాద్‌: ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఇంధన పొదుపుపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నెడ్‌క్యాప్‌ ఎండీకమలాకర్‌ బాబు చెప్పారు. ఏటా డిసెంబర్‌ 14 నుంచి ప్రారంభమయ్యే వారోత్సవాల్లో ఈ సారి గృహిణులకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించే కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యుత్‌, వాహన ఇంధనం పొదుపు అంశాలను కీలకంగా ఎంచుకుని వీటిపై ప్రచారం చేస్తూ ముందుకెళతామన్నారు. యూనిట్‌ విద్యుత్‌ ఆదా చేయటం ఒకటిన్నర యూనిట్లు ఉత్పత్తి చేయడంలో సమానమని ఆయన తెలిపారు. ఇంధనం నిత్యజీవితంలో ప్రధానమైనదని దీన్ని పొదుపుగా వాడుకుంటేనే
భవిష్య తరాలకు అందుబాటులో ఉంటుందనే కోణంలో తమ అవగాహన కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఏడాది కాలంలో ఇంధనం పొదుపుగా వాడిన సంస్థలకు అవార్డుల ప్రధానం చేయనున్నట్లు ఎండీ తెలిపారు.