తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం తగదు: వీ హెచ్‌

హైదరాబాద్‌: ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా తెలంగాణ రాష్ట్రంపై అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చివరి దశకు చేరుకున్నా అడ్డుకోవాలని చూడటం సరికాదన్నారు. హైదరాబాద్‌ అంబర్‌పేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపైనే ప్రజల్లో ప్రచారం చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నియోజక వర్గానికి చెందిన పలువురు యువకులు వీ హెచ్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.