మా కన్నీరింకా ఇంకిపోలేదు : నిర్భయ తండ్రి
ఢిల్లీ: ఆ దుకదృష్టకర సంఘటన జరిగి ఏడాదయ్యింది. కానీ మా కన్నీరింకా ఇంకిపోలేదు. ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఏడుస్తూనే ఉంటాం… అన్నారు నిర్భయ తండ్రి. యావత్ దేశాన్ని కుదిపేసేలా దేశ రాజధానిలో నిర్భయపై దారుణం జరిగి ఏడాదైన సందర్భంగా పత్రికల వారితో మాట్లాడుతూ ఆయన గద్గద స్వరంతో ఈ మాటలు చెప్పారు.