ప్రభుత్వ లాంఛనాలతో మండేలాకు అంతిమ నివాళులు
కును: నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలాకు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ నివాళులు అర్పించారు. నెల్సన్ మండేలా సన్నిహిత మిత్రులు ఆర్చ్ బిషవ్ డెస్మండ్ టుటు, ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌తో సహా పలువురు దేశవిదేశాల ప్రముఖులు, సెలెబ్రిటీలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సర్వీస్ నిర్వహిస్తున్న సమయంలో ప్రభుత్వం తరఫున 21 తుపాకులతో శాట్యూట్ చేశారు. ప్రభుత్వ లాంఛనాల కార్యక్రమం పూర్తయిన తర్వాత సంప్రదాయం ప్రకారం ప్రైవేటు కార్యక్రమం పైర్తయిన తర్వాత సంప్రదాయం ప్రకారం ప్రైవేటు కార్యక్రమం కోసం సన్నిహితులకు మండేలా భౌతికకాయాన్ని అప్పజెప్పారు. థెంబు తెగ ఆచారం ప్రకారం కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఎంపిక చేసిన 450 మంది మాత్రమే సమాధి వద్దకు నెమ్మదాగా నడిచి వెళ్తున్నారు.