ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్‌ఆద్మీ నిర్ణయం
ఢిల్లీ: గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్‌ఆద్మీ పార్టీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికయ్యే అవకాశముంది. సోమవారం ఉదయం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశమైన ఆమ్‌ఆద్మీ పార్టీ శాసనసభాపక్షం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ … ప్రజాభిప్రాయం సేకరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాసేపట్లో లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలస్తామని చెప్పారు.