పద్మశ్రీ అవార్డులను వెనక్కిచ్చేయండి : హైకోర్టు
హైదరాబాద్ : సినీనటులుమోహన్ బాబు, బ్రహ్మానందం తమ పద్మశ్రీ అవార్డులను వెనక్కి ఇచ్చేయాలని హైకోర్టు సూచించింది. పద్మశ్రీ గ్రహీతలు పాటించాల్సిన మార్గదర్శకాలకు విరుద్ధంగా వారు వ్యవహరించారని ఆక్షేపించింది. వారం రోజుల్లో వారి అవార్డులను స్వచ్ఛందంగా వెనక్కివ్వాలని పేర్కొంది. ‘దేనికైనా రెడీ’ సినిమా వివాదంపై దాఖలైన ఫిర్యాదుపై న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది. కేసు తదుపరి విచారణకు వారం పాటు వాయిదా వేసింది.