జపానులో 73 ఏళ్ల వృద్ధుడికి మరణశిక్ష

టోక్యో : జపానులో ఈ ఏడాది ఇప్పటికే ఆరుగురికి ఉరిశిక్ష అమలుచేశారు. 2004లో హత్య, దొంగతనం నేరాలకు పాల్పడిన ఒక వ్యక్తిని (73) గత వారం ఉరితీశారు. మరో 132 మందికి మరణ శిక్ష అమలు చేయాల్సి వుంది. జపానులో మరణశిక్ష అమలు కొనసాగించడం పట్ల మానవ హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. అయితే జపాను ప్రజలు మాత్రం మరణశిక్షకే మద్దతిస్తున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి.