ఉద్యమ నేతకు ఘన నివాళి
రోధించిన గన్‌పార్క్
భూమయ్యది సర్కారీ హత్యే
టిప్పర్ ముసుగులో హతమార్చారు
తీవ్రంగా ఖండించిన మావోయిస్టు పార్టీ
హైదరాబాద్, డిసెంబర్25(జనంసాక్షి):
అన్ని వేళ్లు ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయి. ఆకుల భూమయ్యది హత్యేనని…పతకం ప్రకారమే ఆయనను ప్రభుత్వమే హత్య చేయించందని మావోయిస్టు పార్టీ ఆరోపించాయి. బుధవారం మావోయిస్టు పార్టీ కేంద్ర రీజినల్ బ్యూరో కార్యదర్శి ఆనంద్ ఓ ప్రకటనలో ఆరోపించారు. టిప్పర్ ముసుగులో ప్రభుత్వమే హత్య చేయించందని ఆరోపించారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఆశయ సాధన కోసం అసువులు బాసిన ప్రజాయోధుడికి తమ పార్టీ, ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం జోహార్లు అర్పిస్తోందని తెలిపారు. భూమయ్య కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అని ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను మవోయిస్టుల అణచివేత ప్రయోగశాలగా మార్చుకుందని విమర్శించారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం తాము మరింత పోరాడుతామని ఆయన తెలిపారు. భూమయ్య ఆశయాల కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.కరీంనగర్‌లోని బీర్‌పూర్‌లో అంతర్మథనం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తునే తుపాకులతో కవాతు చేస్తూ ప్రజలను భయభ్రంతులకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు. గత రెండున్నర శతాబ్దాలలో భూమయ్యను హత్య చేయడానికి ప్రభుత్వం ఎన్నో సార్లు ప్రయత్నం చేసిందని విమర్శించారు. మావోయిస్టులను చంపేందుకు ప్రభుత్వం నిరంతరంగా ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే బెల్లి లలిత, అయిలన్న, కనకాచారి, సుదర్శన్, నల్ల వసంత్‌లను క్రూరంగా హత్య చేసిందని ఆయన విమర్శించారు. గంటి ప్రసాదంను కూడా ప్రభుత్వం హత్య చేయించిందని తెలిపారు. ఆకుల భూమయ్యను హత్య చేయించడాన్ని ఆయన పిరికి పంద చర్యగా అభివర్ణించారు.
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య మృతదేహానికి ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల స్తుపం వద్ద ఆయన మృతదేహానికి ప్రొ. కోదండరాం. ఎంపీ ఆనంద్ భస్కర్, తెరాస నేత నాయిని నర్సింహారెడ్డి, భాజపా నేత నాగం జనార్దన్‌రెడ్డి, గద్దర్, వేదకూమార్, చుక్కా రామయ్య, వరవరరావు, దేశపతి శ్రీనివాస్, విమలక్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరవరరావు, గద్దర్, కోదండరాం, విమల, తదితరులు మాట్లాడారు. ఆకుల భూమయ్యను ప్రభుత్వమే హత్య చేయించందని ఆరోపించారు. టిప్పర్ ముసుగులో పోలీసులే హత్యకు కుట్రపన్నారని ఆరోపించారు. భూమయ్య హత్యపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రసాదంను ఇదే తరహాలో కుట్రపన్ని హత్య చేయించారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆకుల భూమయ్యది కీలక పాత్ర అన్ని తెలిపారు. ప్రజాస్వామ్య విలువల కోసం నిరంతరం పోరాడాడని అన్నారు. పేదల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన భౌతిక కాయాన్ని తెలంగాణ వాదులు, పలు ప్రజా సంఘాల నాయకులు సందర్శించి నివాళ్లు అర్పించారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం రాజయ్య భౌతికకాయాన్ని సందర్శించిన పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు. అనంతరం సికింద్రాబాద్‌లోని అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించలేదు. పతకం ప్రకారమే హత్య చేయించారు అని వారు ఆరోపిస్తున్నారు. భూమయ్య మరణంపై న్యాయ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. బుధవారం పార్దీవ దేహన్ని సందర్శించేందుకు తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు, టీపీఎఫ్ నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారు.