చైనాలో సంస్కరణలకు పార్లమెంటు ఆమోద ముద్ర
బీజింగ్ : ఒకే సంతానం నియమానికి చైనా అధికారికంగా సవరణలు చేసింది. వివాదాస్పద లేబర్ క్యాంపు వ్యవస్థను కూడా రద్దు చేసింది. శనివారం ఈ మేరకు తీర్మానాలపై పార్లమెంటు ఆమోదముద్ర పడింది. అధికార కమ్యూనిస్టు పార్టీ గత నెలలో ప్రకటించిన సంస్కరణల్లో అత్యంతప్రముఖమైనవి ఇవి రెండూ. ఒకే సంతానం అన్న విధానాన్ని చైనా కొన్ని దశాబ్దాలుగా అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. మారిన నియమాల ప్రకారం భార్యాభర్తలిద్దరిలో ఒక్కరు ఒంటరి సంతానమైనట్లైతే ఆ జంట ఇద్దరు పిల్లలను కనడానికి అర్హులవుతారు. గతంలో ఇద్దరూ ఒంటరి సంతానమైతేనే రెండో బిడ్డకు అవకాశం లభించేది.