ముక్తసరిగా ముగించిన ‘వట్టి’
హైదరాబాద్, జనవరి 8 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ముసాయిదా-2013పై ఎట్టకేలకు శాసనసభలో మళ్లీ చర్చ ప్రారంభమైంది. ఈ ముసాయిదాను అసెంబ్లీలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ డిసెంబర్ 16న ప్రవేశపెట్టగా, అదేరోజు సాయంత్రం అప్పటి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు చర్చను ప్రారంభించారు. సీమాంధ్ర సభ్యుల ఆందోళనల మధ్యే స్పీకర్ సభలో ముసాయిదాను ప్రవేశపెట్టగా, అప్పట్నుంచి ఇప్పటి వరకు సభలో అదే సీన్ పునరావృత్తమవుతూ వచ్చింది. బుధవారం స్పీకర్ సూచన మేరకు మంత్రి వట్టి వసంతకుమార్ బిల్లుపై చర్చను ప్రారంభించారు. అయితే చర్చకు శ్రీకారం చుట్టినా అంతలోనే వాయిదా పడింది. బుధవారం సభ ప్రారంభమయ్యాక రెండుసార్లు వాయిదా అనంతరం శాసనసభ సమావేశం తిరిగి ప్రారంభమైంది. ఇరుప్రాంతాల సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. సమావేశ నిర్వహణకు సహకరించాలని స్పీకర్ సభ్యులను, ఆయా పార్టీల నేతలను కోరారు. చర్చలో పాల్గొనాలని సూచించారు. పదేపదే చేసిన విజ్ఞప్తిని వారు పట్టించుకోలేదు. ఈ దశలో మంత్రి ఆనం ఆందోళన కొనసాగుతున్నా బిల్లుపై చర్చకు గల కారణాలను వివరించారు. మంత్రి ఆనం మాట్లాడుతూ టిడిపి, వైకాపా చర్చకు సహకరించాలన్నారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లుపై చర్చించేందుకు బీఏసీలో అందరూ అంగీకరించారని, చర్చలో భాగస్వాములు కావాలని అన్ని పక్షాలను కోరుతున్నామని ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. సమాచారం కావాలని ప్రధాన ప్రతిపక్షం అడిగిందని, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని రెండు రోజుల్లో అందిస్తామని ఆయన తెలిపారు. స్పీకర్ విజ్ఞప్తితో టిడిపి సభ్యులు తమ సీట్లలో కూర్చున్నారు. సభ్యుల నినాదాల మధ్యే స్పీకర్ నాదెండ్ల మనోహర్ సూచనతో మంత్రి వట్టి వసంతకుమార్ బిల్లుపై చర్చను ప్రారంభించారు. ఆంధ్రా, రాయలసీమ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఆంధప్రదేశ్ పునర్వ్యవ్థసీకరణ బిల్లు ఉందని, బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మంత్రి వట్టి వసంతకుమార్ పేర్కొన్నారు. మంత్రి మాట్లాడుతున్నా సభలో నినాదాలు ఆగలేదు. వైకాపా సభ్యులు బిల్లు ప్రతులను చించి గాలిలోకి విసిరారు. దాంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. దీంతో చర్చ ప్రారంభమైనా వాయిదా తప్పలేదు. అయిదో రోజు కూడా సభ ప్రారంభం అయికాక ముందే సీమాంధ్ర ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. రాష్ట్ర విభజన అంశంపై సుదీర్ఘంగా చర్చించి ఇరుప్రాంతాలకు న్యాయం కోసం ప్రతిపాదనలను చొప్పించి బిల్లును గడువులోగా ఢిల్లీకి పంపించాల్సింది పోయి దుర్మార్గంగాను, అవివేకంగాను వ్యవహరిస్తూనే ఉన్నా రు శాసనసభ్యులు. దీంతో సభ అయిదో రోజు కూడా ఎలాంటి చర్చ చేపట్టకుండానే వాయిదా పడింది. మం గళవారం ఉదయం సభ ప్రారంభం అవుతూనే కేవలం మూడంటే మూడు నిమిషాలు కూడా కాకముందే గంటసేపు వాయిదా వేస్తూ స్పీకర్ నాదేండ్ల మనోహర్ ప్రకటించి వెల్లిపోయారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉం చాలని డిమాండ్ చేస్తూ వైసిపి ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టూముట్టి నిరసన వ్యక్తం చేయడంతో సీమాంధ్రలో దుర్గతి పడుతుందని భావించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సైతం పోడియం వద్దకు వెళ్లారు. దీనికితోడు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న తెలంగాణకు చెందిన టీఆర్‌ఎస్, సిపిఐ, బిజెపి ఎమ్మెల్యేలు కూడా పోడియంకు వెల్లి చర్చ జరుపాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా దాలుచేశారు. ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు వారి వారి నినాదాలు చేస్తుండగా, స్పీకర్ ఎంత వారించినా కూడా వినలేదు. చర్చ ప్రారంభించిన తర్వాత ఏం చెప్పాలో మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని చెప్పినా కూడా ఖాతరు చేయక పోవడంతో స్పీకర్ అసెంబ్లీని గంట సేపు వాయిదావేస్తూ ప్రకటించి వెళ్లిపోయారు. అంతకుముందు సిపిఐ, టిడిపి, వైసిపిలు ఇచ్చిన వాయిదా తీర్మాణాలను తిరస్కరించినట్లు స్పీకర్ తోసి పుచ్చారు. గురు, శుక్రవారాల్లో సభలో చర్చ జరిగిన తర్వాత ఉభయ సభలు ఈనెల 17కు వాయిదా పడతాయి.
తాజావార్తలు
- ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్
- నారా లోకేశ్ కు భక్తుడి ఫిర్యాదు.. 24 గంటల్లోనే చర్యలు
- పెద్ద ధన్వాడకు భారీగా చేరిన రైతులు
- ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
- మే 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు
- అక్రమ వలసదారుల్లో గుబులు
- ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి..
- దళితుల్ని, ఆదివాసులను బానిసలుగా మార్చే కుట్ర
- ఘనంగా గణతంత్ర వేడుకలు
- హయత్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి
- మరిన్ని వార్తలు