అమెరికాను వణికిస్తున్న మంచు తుపాన్
వాషింగ్టన్: మంచుతుపాను అమెరికాను వణికిస్తూనే ఉంది. తాజాగా దేశ ఈశాన్య ప్రాంతం ఈ తుపాను బారిన పడింది. పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. 3000 విమాన సర్వీసులు రద్దయ్యాయి. మంచు, గాలి కలిసి బలంగా వీస్తుండడంతో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాల్లో అత్యవసర స్థితి ప్రకటించారు. ప్రజలను ఇళ్లలోనే ఉండిపోవాలని హెచ్చరికలు జారీచేశారు. వైట్‌హౌస్ మంగళవారం నిర్వహించే విలేకరుల సమావేశాన్ని రద్దు చేసింది.