కిరణ్‌ ఏ హోదాలో మాట్లాడుతున్నవ్‌

వ్యక్తిగతంగానా? సీఎంగానా?
నిలదీసిన జానా
సభా నాయకుడు హుందాగా వ్యవహరించాలి : అక్బరుద్దీన్‌
ఆకట్టుకోలేకపోయిన కిరణ్‌ ప్రసంగం
్టటీ బిల్లుకు మద్దతు ప్రకటించిన మంత్రి బాలరాజు
హైదరాబాద్‌, జనవరి 22 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై ఏ హోదాలో మాట్లాడుతున్నవంటూ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డి ముఖ్యమంత్రి కిరణ్‌ను నిలదీశారు. కిరణ్‌ ఏ ¬దాలో బిల్లును వ్యతిరేకిస్తున్నారో చెప్పాలన్నారు. సభా నాయకుడిగా సీఎం ¬దాలో వ్యతిరేకిస్తున్నారా లేక, వ్యక్తిగత ¬దాలో వ్యతిరేకిస్తున్నారా చెప్పాలన్నారు. దీనికి సీఎం మాట్లాడుతూ తాను సీఎంగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదన్నారు. తాను సోనియా వల్లనే సీఎంను అయ్యానని కూడా అన్నారు. తన ప్రసంగం పూర్తయ్యాక తాను ఎందుకు వ్యతిరేకిస్తున్నానో చెబుతానన్నారు. అందువల్ల తా ను చెప్పేది ఓపిగ్గా వినాల్సిందిగా సభ్యులను కోరుతున్నానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శాసనసభలో విభజన బిల్లుపై ఆయన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తాను చెప్పేది పూర్తిగా వింటే తానెందుకు కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నదీ అర్థమవుతుందన్నారు. సోనియా గాంధీ, కాంగ్రెస్‌పార్టీ వల్లే తాను సీఎంను అయ్యానని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ పరిస్థితుల్లో తాను సీఎంగా ఉండటం తన దురదష్టమని పేర్కొన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు.అయినా టిఆర్‌ఎస్‌ సభ్యులు విభజన బిల్లుపై చర్చకు అంతరాయం కలిగించారు. సీఎం మాట్లాడుతుండగా వారు సభ్యులు నినాదాలు చేశారు. సీఎం ప్రసంగం పట్ల అభ్యంతరం వ్యక్తంచేస్తూ పోడియం వద్ద సభ్యులు నిరసనకు దిగారు. తాను చెప్పేది ఓపిగ్గా వినాల్సిందిగా సభ్యులను కోరుతున్నానని ముఖ్యమంత్రి కిరణ్‌ అన్నారు. శాసనసభలో విభజన బిల్లుపై ఆయన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తాను చెప్పేది పూర్తిగా వింటే తానెందుకు కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నదీ అర్థమవుతుందన్నారు. ఈ దశలో ఆర్థికమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడాల్సిందిగా స్పీకర్‌ కోరారు. సభానాయకుడు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు అడ్డుకోవడం తగదని మంత్రి ఆనం అన్నారు. బిల్లుపై అనేకమంది సభ్యులు ఇరుప్రాంతాలనుంచి మాట్లాడారని, సీఎం ఎం చెబుతారో విందామని ఆనం అన్నారు. విభజన బిల్లుపై సమయం పొడిగిస్తారని ఎదురు చూశామన్నారు. సమయం తక్కువుందని, సీఎం, ప్రతిపక్షనేత, పలువురు మాట్లాడాల్సి ఉందని, ప్రసంగాలకు ఆటంకం కలిగించవద్దని ఆయన సభకు విజ్ఞప్తి చేశారు. సిఎం స్థానంలో ఉన్న వ్యక్తి సిఎంగానే, సభానాయకుడిగానే మాట్లాడుతారని, ఇందులో ఎవరికి అనుమానాలు వద్దన్నారు. మంత్రి జానారెడ్డికి కూడా అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఆయన మాట్లాడాక అనుమానాలపై చర్చించుకోవచ్చన్నారు. అయితే సీఎం ఏ ¬దాలో మాట్లాడుతున్నారని మంత్రి జానారెడ్డి మరోమారు ప్రశ్నించారు. తాము సీఎం సభానాయకుడి ¬దాలో మాట్లాడితే అందులో భాగస్వామ్యం కాలేమన్నారు. సీఎం వ్యక్తిగతంగా మాట్లాడితే తమకు అభ్యంతరం లేదన్నారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రసంగానికి టిఆర్‌ఎస్‌ సభ్యులు అడుగడుగునా అడ్డు తగిలారు. సీఎం తాను బిల్లును వ్యతిరేకిస్తున్నానంటూ ప్రసంగం మొదలు పెట్టారు. ఆయన తన ప్రసంగం మొదలు పెట్టగానే స్పీకర్‌ పోడియాన్ని చుట్టిముట్టి తమకు క్లారిఫికేషన్‌ కావాలంటూ నినాదాలు చేశారు. సభానాయకుడు మాట్లాడుతున్న సమయంలో అడ్డుతగలడం సరికాదని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ పదేపదే వారికి సూచన చేశారు సభ్యులు వారి స్థానాల్లోకి వెళ్లాలని అన్నారు. చివరకు జానారెడ్డి విజ్జొప్తి మేరకు టీఆర్‌ఎస్‌ సభ్యులు కొంత శాంతించారు. దీంతో సీఎం తన ప్రసంగాన్ని కొనసాగించారు.
ఆంధ్రాప్రాంతంతో కలిసిన తర్వాత ఎక్కడెక్కడ వెనకబడ్డారో చెప్పాల్సి ఉందని, తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత సీఎంగా తనపై ఉందని అన్నారు. శాసనసభలో విభజన బిల్లుపై మాట్లాడుతూ ఆయన అనేక జాతీయ విద్యా, పరిశోధన సంస్థలు ఇక్కడికి వచ్చాయని, ఉద్యమాలు జరుగుతున్నా ఇక్కడి సదుపాయాల రీత్యా పరిశ్రమలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఉపగ్రహాల్లో వినియోగించే ఉపకరణాల యూనిట్‌ రింగ్‌రోడ్డు సమీపంలో రాబోతోందన్నారు. ఇసుజు కార్లయూనిట్‌ త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. అనేక అంతర్జాతీయ సమ్మేళనాలకు హైదరాబాద్‌ వేదికగా నిలిచిందని సీఎం చెప్పారు. కలిసున్నాం కాబట్టే సంక్షేమ కార్యక్రమాలు బాగా చేయగలుగుతున్నాం. గతంలో 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ తీర్మానం చేశాకే విభజన చేపట్టారు. ఇప్పుడెందుకు ఆ పక్రియ పాటించట్లేదని మా ప్రభుత్వానే అడగాల్సి వస్తోందన్నారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా ఎక్కడా విభజన జరగలేదన్నారు. అప్పటి ఎన్డీయే, ఇప్పటి యూపీఏల విధానం ఒక్కటే.. అసెంబ్లీ తీర్మానం అవసరమన్నారు. అసెంబ్లీకి తీర్మానం, బిల్లు రెండూ వస్తాయని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి చెప్పారన్నారు. శ్రీకృష్ణ కమిటీ వేశారు. కానీ దాని సిఫార్సులను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. విభజన పక్రియలో గత పద్ధతులను పాటిస్తామని రాజ్యసభలో చిదంబరం చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి టిఆర్‌ఎస్‌ సభ్యులను ఉద్దేశించి వాస్తవాలు చెబితే ఉలికిపడుతున్నారెందుకని ప్రశ్నించారు. వాస్తవాలు దాచిపెట్టి ఇన్నాళ్లూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. తాను చెప్పేవన్నీ రికార్డుల్లో ఉన్న అంశాలేనని, వాస్తవాలు వినేందుకు ధైర్యం, సాహసం ఉండాలని సీఎం వ్యాఖ్యానించారు. భాషాప్రయుక్త రాష్టాల్ర ఏర్పాటు జాతీయోద్యమంలో భాగమేనని ఇందిర చెప్పారన్న విషయాన్‌ఇన ఆయన పదేపదే గుర్తు చేశారు. తెలుగువాళ్లు దేశప్రయోజనాలకు వ్యతిరేకంగా వెళ్లరని ఇందిర విశ్వసించారన్నారు. రాయలసీమ ఉద్యోగుల కోసమే జయభారత్‌రెడ్డి కమిటీ వేశారని గుర్తు చేశారు. తెలంగాణలో 15.5 శాతం బయటి ప్రాంతాల వాళ్లు ఉన్నారని కమిటీ చెప్పింది. ఆంధ్రాలో 30 వేలు, రాయలసీమలో 16 వేలు బయటివాళ్లు ఉన్నారని చెప్పింది. వెనకబడిన ప్రాంతాల వారికీ అవకాశం ఇవ్వాలని 6 పాయింట్‌ ఫార్ములా తెచ్చారు. విదర్భ డిమాండ్‌ను ఇతర మహారాష్టీయ్రులు వ్యతిరేకిస్తున్నారని అద్వానీ చెప్పారు. 2004లో సోనియాకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రెండో ఎస్సార్సీకి విజ్ఞాపన ఇచ్చారు. రెండో ఎస్సార్సీ కోసం ఎన్‌డీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ పార్టీ లేఖ కూడా రాసింది. ఇవన్నీ కూడా తెలుసుకోవాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం కనుకనే నాగార్జునసాగర్‌తో సహా ఇతర ప్రాజెక్టులను కట్టుకునే వెసలుబాటు వచ్చిందన్నారు. అభివృద్ది అనేది ఉమ్మడి రాష్ట్రంలోనే సాధ్యమయ్యిందని సిఎం వివరణ ఇచ్చారు. తన ప్రసంగాన్ని మరునాటికి కొనాసగిస్తానని చెప్పారు. అయితే చర్చలో తనంటే ఏదో చూపిస్తానన్న ముఖ్యమంత్రి ప్రసంగం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. వాదప్రతివాదనలు, అభ్యంతరాలు, రూల్స్‌పై చర్చ తరవాత శాసనసభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. సభలో రాష్ట్రపతి ఇచ్చిన ఆదేశాల మేరకే చర్చ జరుగుతందని అన్నారు. సిఎం తన ప్రసంగాన్ని రేపు కొనసాగిస్తారని చెప్పారు. ఇకపోతే బిల్లుపై చర్చకు రాష్ట్రపతి వారం రోజులు గడువు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అధికారికంగా రాష్ట్రపతి భవన్‌ ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. మరోవైపు సభా సంప్రదాయాలు, సభ్యుల అభిప్రాయాల మేరకు చర్చను కొనసాగిస్తామని స్పీకర్‌ నాదెండ్ల అన్నారు. ఇది చాలా సున్నితమైన అంశమని, దీనిపై గతంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారన్నదానికి ఓ విధానం అన్నది సప్‌ష్టంగా లేనందు వల్ల రెగ్యులర్‌ ప్రాక్టీసెస్‌ ప్రకాం సభను నడుపుతామని అన్నారు. దీనిపై ఎవరికీ అనుమానాలు వద్దన్నారు. అంతకు ముందు మాట్లాడిని హరీష్‌ రావు సిఎం తీరును తప్పుపట్టారు. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు సభలో చర్చకు వచ్చిన సందర్భంలో తాను సీఎంగా ఉండటం దురదృష్టకరమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలను హరీశ్‌రావు ఖండించారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని లేకపోతే ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం తగదన్నారు. ఇక విభజన బిల్లుపై సిఎం వ్యాఖ్యలు సరికాదన్నారు. గత బడ్జెట్‌ సమావేశాల్లో సిఎం తెలంగాణ బిల్లుపై మాట్లాడుతూ కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పి ఇప్పుడు వ్యతిరేకించడం సరైనా పద్దతేనా అని ప్రశ్నించారు. గతంలో సిఎం చేసిన ప్రసంగాలకు సంబంధించి సిడిలను సిఎం చూసుకోవాలన్నారు. దానికి సంబంధించి సిడిలను ఆయన స్పీకర్‌కు అందజేశారు. ముఖ్యమంత్రి ప్రసంగంపై స్పందించిన మంత్రి జానారెడ్డి తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. గతంలో ఇందిరాగాంధీ, అద్వానీ ఏం చెప్పినా అది బిల్లు రాకముందేనని, ఇప్పుడు అభిప్రాయాలు చెప్పవచ్చు కానీ ఓటింగ్‌ సరికాదని అన్నారు. లాభనష్టాలు బేరీజు వేసుకుంటూ పోవడం సరికాదన్నారు. విలీనం అయినప్పుడు కూడా భిన్నాభిప్రాయాలున్నా సభ ఆమోదించిందని, ఇప్పటి రాష్ట్ర విభజన బిల్లునూ అలాగే ఆమోదించాలని కోరుతున్నానని జానారెడ్డి అన్నారు. ఎందరు వ్యతిరేకిస్తున్నారో, అనుకూలంగా ఉన్నారో సంఖ్య చెప్పవచ్చన్నారు. అంతేగానీ ఓటింగ్‌ లేదా డివిజన్‌ సరికాదన్నారు. ఇలా చేయడం రాష్ట్రపతి ఆదేశాలను ధిక్కరించడమే అవుతుందన్నారు. ఇదే విసయమై ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్‌ కూడా తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. సభానాయకుడు తన పరిమితిని మించి మాట్లాడడం సరికాదన్నారు.ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రభుత్వం, అధికార పార్టీ సభకు వివరణ ఇవ్వాలని ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్‌ కోరారు. సభలో తీర్మానం తీసుకురావాలంటే ముందుగా సభాపతి అనుమతి తీసుకోవాలని ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు తీసుకోబేయే నిర్ణయం రాష్ట్రపతి బిల్లు అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉండకూడదన్నారు. బిల్లుపై సభ తన ప్రక్రియను పూర్తి చేశాక ఎలాంటి నిర్ణయం తీసుకన్నా అభ్యంతరం ఉండబోదన్నారు. బిజెపి సభ్యుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ తన అంతర్గత రాజకీయాలకు శాసనభను ఉపయోగించడాన్ని సహి