నేడు కాంట్రాక్ట్ లెక్చరర్ల దీక్ష
ఆదిలాబాద్, జనవరి24: ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈనెల 25న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద సంకల్ప దీక్ష చేపడుతున్నారు. వీరి పోస్టులను క్రమబద్దీకరించకుండా మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన వారు దీక్షలో పాల్గొంటారిని ప్రభుత్వ కళాశాలల ఒప్పంద అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు తెలిపారు. ఈ దీక్షలో ఒప్పంద అధ్యాపకులంతా పాల్గొనాలని ఆయన కోరారు.



