టై గా భారత్‌- న్యూజిలాండ్‌ మ్యాచ్‌

ఆక్లాండ్‌:ఆక్లాండ్‌లో జరిగిన భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ టై అయింది. ఐదు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో న్యూజిలాండ్‌ జట్టు ఉంది. వన్డే సిరీస్‌ పై భారత ఆశలు సజీవంగా ఉన్నాయి. ఈ రోజు జరిగిన మ్యాచ్‌ న్యూజిలాండ్‌ జట్టు 314 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఆ స్కోరును ఛేదించే క్రమంలో తొమ్మిది వికెట్లు కోల్పోయిన భారత జట్టు 314 పరుగులు చేసి స్కోరును సమం చేసింది. దీంతో మ్యాచ్‌ టైగా ముగిసింది.