చిన్న రాష్ట్రాలు.. ప్రగతికి సోపానాలు
జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ, జనవరి 25 (జనంసాక్షి) :
చిన్న రాష్ట్రాలు ప్రగతికి సోపానాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. 65వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం ఆయన జాతినుద్దేశించి మాట్లాడారు. స్వతంత్ర భారతం 7వ దశకంలోకి అడుగిడుతోన్న తరుణంలో చిన్నరాష్ట్రాలపై న్యాయమైన విధానమని ప్రణబ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. బలవంతంగా ఏదీ చేయలేరని తెలిపారు. దేశంలో ఆరోగ్యకరమైన అభిప్రాయ భేదాలు మంచివేనన్నారు. సమతుల్య అభివృద్ధి నేపథ్యంలోనే చిన్న రాష్ట్రాల కాంక్ష పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అవినీతి కేన్సర్ వంటిదని, దీని నిర్మూలనకు అందరూ పాటు పడాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. చిత్తశుద్ధితో పని చేసే వారినే ప్రజలు ఎన్నుకోవాలని రాష్ట్రపతి సూచించారు. భారత్ బలీయమైన శక్తిగా ఎదుగుతుందని ప్రణబ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సవాళ్లను అధిగమించే శక్తి భారత్‌కు ఉందని చెప్పారు. కాగా దేశంలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడాల్సిన అవసరముందని ప్రణబ్‌ముఖర్జీ అభిప్రాయపడ్డారు