ఫిబ్రవరి 7న ఢిల్లీలో వర్క్‌షాప్
తెలంగాణకు మద్దతిచ్చే పార్టీలతో చర్చలు : కోదండరామ్
హైదరాబాద్, జనవరి 28 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఫిబ్రవరి 7న ఢిల్లీలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. మంగళవారం జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన స్టీరింగ్ కమిటీ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణ బిల్లుపై సభ్యులకు కేవలం అభిప్రాయం మాత్రమే చెప్పే అవకాశముందని ఆయన తెలిపారు. సభ్యులకు తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి బిల్లుపై అభిప్రాయం ఏమాత్రం లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ విషయం తెలియకుండానే సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ తన అవగాహణ లేమిని బయటపెట్టుకుంటున్నాడని మండిపడ్డారు. లోక్‌సత్తా అధ్యక్షుడు జేపీ కన్‌ఫ్యూజన్‌కు తెరతీశారని, దానిని పట్టుకొని సీమాంధ్రులు వేలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజలను మభ్య పెట్టేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు సాగబోవని తేల్చిచెప్పారు.