చర్చ ముగిసింది


టీ బిల్లు ఢిల్లీకి – స్పీకర్‌

అభిప్రాయాలు రాష్ట్రపతికి పంపుతాం

సీఎం తీర్మానం ఆమోదం-అసెంబ్లీ నిరవధిక వాయాదా

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పుర్వ్యవస్ధీకరణ బిల్లుపై చర్చ ముగిసింది. చివరిరోజు అత్యంద ఉత్కంఠ వాతావరణంలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర ఏర్పాటులో అసెంబ్లీ పాత్రకు తెరపడింది. ఇక తెలంగాణ బిల్లును తిరస్కరిస్తూ సీఎం కిరణ్‌ ఇచ్చిన నోటీసును మూజువాణి ఓటుతో ఆమోదించినట్లు స్పీకర్‌ ముగించారు. బిల్లుపై మొత్తం 86 మంది సభ్యులు మాట్లాడినట్లు 9072 సవరణలు అందాయని స్పీకర్‌ తెలిపారు. సభ అభిప్రాయాలను రాష్ట్రపతికి పంపుతామని వెల్లడించారు. టీ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు సీఎం ఇచ్చిన తీర్మానాన్ని కూడా ఒక అభిప్రాయంగా పరిగణిస్తూ రాష్ట్రపతికి పంపుతామని స్పీకర్‌ చెప్పారు.