ఈ సమావేశాల్లోనే టీ.బిల్లు : కమల్‌నాథ్‌

న్యూఢిల్లీ: ఈ సమావేశాల్లోనే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ స్పష్టం చేశారు. ఈ నెల 5 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో కమల్‌ నాథ్‌ ఆధ్వర్యంలో ఈ రోజు అఖిల పక్ష భేటీ నిర్వహించారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లులు ,ఇతర వ్యవహారాలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో టి.బిల్లు ప్రవేశపెట్టడడంపై గందరగోళం ఏర్పడింది. విపక్షాలు టి.బిల్లు విషయంలో కేంద్ర వైఖరిపై మండిపడ్డాయి. దీన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకురాలైన సుష్మా స్వరాజ్‌ సమర్ధించడంతో బిల్లును ప్రవేశ పెట్టడంపై కమల్‌ నాథ్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడతారని ఆయన తెలిపారు.