ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఆమోదం: ప్రధాని


న్యూఢిల్లీ: ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశ పెడతామని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ స్పష్టం చేశారు. పార్లమెంటులో టీ బిల్లు తప్పకుండా ఆమోదం పొందుతుందని ఆయన తేల్చి చెప్పారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు.

చాలా కాలంగా తెలంగాణ అంశం పెండింగ్‌లో ఉందని, తెలంగాణ బిల్లు ఆమోదానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. మహిళా, అవినీతి, వికలాంగులకు సంబంధించిన మరికొన్ని బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ఆమోదింపజేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు.