తెలంగాణ బిల్లు రెడీ
స్వల్ప సవరణలతో సిద్ధం
ఈనెల 10న రాజ్యసభలో.. : షిండే
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ముసాయిదాను జీవోఎం సిద్ధం చేసింది. తెలంగాణ బిల్లును కేంద్ర కేబినేట్‌కు పంపాలని జీవోఎం నిర్ణయించింది. తెలంగాణ బిల్లుపై మంగళవారం నార్త్ బ్లాక్‌లో ¬ంశాఖ మంత్రి షిండే ఆధ్వర్యంలో జీవోఎం సమావేశమైంది. ఈ సమావేశంలో తెలంగాణ బిల్లులో ఉన్న సవరణలపై జీవోఎం సభ్యులు వాడీవేడీగా చర్చలు జరిపారు. ఆంధప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవ్థసీకరణ బిల్లుపై మంగళవారం తుది సమావేశం జరిపిన జీవోఎం కేంద్ర మంత్రివర్గం ముందుకు పెట్టనున్న ప్రతిపాదనలను సిద్ధంచేసింది. కొత్త రాజధాని నిర్మాణం, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. పోలవరం నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే భద్రాచలం డివిజన్‌లోని ప్రాంతాలు సీమాంధ్రకు బదలాయింపు, భద్రాచలం పట్టణం మాత్రం తెలంగాణలోనే కొనసాగింపు, అవశేష ఆంధ్రప్రదేశ్‌లో ఐఐటీ, ఐఐఎంలతో పాటు ఎయిమ్స్ తరహా వైద్యశాల, రాయలసీమకు అంతర్జాతీయ విమానాశ్రయం, కొత్త రాజధాని పదేళ్ల పాటు పన్ను మినహాయింపు తదితర అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది. ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు సహా కీలక అంశాలపై తుది నిర్ణయం మంత్రివర్గం తీసుకోనుంది. పోలవరం అంశంపై తదుపరి సమావేశంలో మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. సమావేశం అనంతరం షిండే విూడియాతో మాట్లాడుతూ ఇదే చివరి జీవోఎం సమావేశమని, ఇక ఈ బిల్లు కేబినెట్ ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లులో కొన్ని సవరణలను ఆమోదించినట్లు షిండే తెలిపారు. జీవోఎం సమావేశానికి షిండే ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రులు కావూరి, పురంధేశ్వరి, కోట్ల, కిల్లీ కృపారాణి హాజరయ్యారు. ఆంధప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ఈ వారంలోనే పార్లమెంటులో ప్రవేశపెడతామని కేంద్ర మంత్రుల బృందంసభ్యుడు గులాంనబీ ఆజాద్ చెప్పారు. తెలంగాణ బిల్లుపై జీవోఎమ్ సమావేశం ముగిసింది. బిల్లుపై రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలు, సవరణలను పరిశీలించారు. బిల్లుకు కొన్ని సవరణలను జిఓఎం ఆమోదించింది. తుది బిల్లుని సిద్ధం చేశారు. సమావేశం ముగిసిన తరువాత గులాంనబీ ఆజాద్ విలేకరులతో మాట్లాడారు. ఇదే ఆఖరి జీవోఎమ్ సమావేశమని ఆజాద్ తెలిపారు. గురువారం జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలో తెలంగాణ నోట్ సిద్ధం చేస్తామని చెప్పారు. ఈవారంలోనే బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడతామన్నారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్ర ప్రాంతంలోనే కలిపేందుకు జీవోఎమ్ నిర్ణయించినట్లు తెలిపారు. మంత్రివర్గ తదుపరి సమావేశం ముందుకు ఆంధప్రదేశ్ పునర్వ్యవ్థసీకరణ బిల్లును పంపించనున్నారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం తగదని సమావేశానికి హాజరైన కేంద్రమంత్రులు జీవోఎంకు తెలిపారు. 5 పుటల నోట్‌ను వారు జీవోఎంకు అందజేశారు. ¬ంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో ప్రారంభం కానున్న జీవోఎం సమావేశానికి వచ్చిన కేంద్రమంత్రి జైరాం రమేశ్‌ను టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నం చేవారు. సమైక్య నినాదాలతో జైరాం రమేశ్‌ను అడ్డుకున్న తెదేపా ప్రజాప్రతినిధులను పోలీసులు పక్కకు తప్పించారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఎమ్మెల్యే రామారావుకు స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే చింతమనేని సమావేశానికి వెళ్తున్న జైరాం రమేశ్ కాళ్లు పట్టుకుని వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బందీ టీడీపీ నేతలను పక్కకు తప్పించారు. అనంతరం జైరాంరమేష్ నార్త్‌బ్లాక్‌కు వెళ్లారు. ఈ నెల 6న కేంద్ర కేబినెట్ ముందుకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు పంపుతారు. 7న రాష్ట్రపతి ప్రణబ్‌కు పంపిస్తారు. ఈ నెల 10న రాజ్యసభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు షిండే రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి లేఖ రాశారు.