తెలంగాణను ముంచేందుకే పోలవరం
నీ ఊరెక్కడా.. పేరెక్కడా
రేణుకపై విరుచుకుపడ్డ తెలంగాణవాదులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 (జనంసాక్షి) :
‘నువ్వెక్కడి తెలంగాణవాదివి.. నీ ఊరెక్కడా.. పేరెక్కడా’ అంటూ తెలంగాణవాదులు రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై విరుచుకుపడ్డారు. భద్రాచలం డివిజన్‌లోని పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపవద్దని డిమాండ్ చేస్తూ ఏపీ భవన్ గోదావరి బ్లాక్ ముందు అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థులు శనివారం ఆందోళన చేపట్టారు. రేణుకాచౌదరి విద్యార్థుల దీక్ష స్థలికి వచ్చి అక్కడ కూర్చున్నారు. దీంతో రేణుకాచౌదరి గో బ్యాక్ అంటూ విద్యార్థులు తెలంగాణవాదులు నినాదాలు చేశారు. దీంతో ఏపీభవన్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీరికి ఎంపీ రేణుకాచౌదరి మద్దతు తెలిపేందుకు అక్కడి వెళ్లగా, తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు అభ్యంతరం తెలిపారు. రేణుకాచౌదరి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు, ఉద్యోగుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఉద్యోగులపై రేణుకాచౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తర్వాత ఇరువురు శాంతిచడంతో రేణుకాచౌదరి ధర్నాలో బైఠాయించారు. ఈ సందర్భంగా రేణుకాచౌదరి మాట్లాడుతూ భద్రాచలం డివిజన్ తెలంగాణదే అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ ఒక్క గ్రామాన్ని ఒదులుకోబోమని రేణుకాచౌదరి తెలిపారు. సీమాంధ్రలో భద్రాచలం ముంపు గ్రామాలను కలవ వద్దంటూ తెలంగాణ విద్యార్థి జేఏసీ శనివారం ఏపీభవన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగింది. అయితే ఈ ధర్నాకు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుక చౌదరిని ఆహ్వానించడంపై జేఏసీలోని కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరికి వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో ఉద్రిక్తత ఏర్పడింది. రేణుకా గో బ్యాక్ అంటూ నినాదాలతో ¬రెత్తింది. దాంతో ఉద్యోగ సంఘాలు, విద్యార్థుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కాగా విద్యార్థి జేఏసీ ధర్నాకు రౌణుకా చౌదరి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో భద్రాచలానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. భద్రాద్రి రాముడి ఆలయాన్ని కాపాడుకోవటం తమ లక్ష్యమన్నారు. రామాలయ ఆస్తులపై తెలంగాణ బిల్లులో స్పష్టత ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకే తాను వచ్చానని రేణుక తెలిపారు. రాముడికి వేల ఎకరాల భూములు ఉన్నాయని, అవన్నీ సీమాంధ్రకు వెళితే ఇక్కడ అభివృద్ది ఆగిపోతుందన్నారు. దీనికోసం ఎంతకైనా పోరాడుతామని అన్నారు. వీటిని అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో భద్రాచలానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆ ప్రత్యేకతను కపాడుకోవడమే మా ప్రథమ లక్ష్యమని పేర్కొన్నారు. ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడాన్ని కేంద్రం విరమించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ వీరు ఈ ధర్నాకు దిగారు. తను పాల్గొనడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమె అపరకాళికాలా ముందుకు ఊగారు. తనను ఎవరు నిలువరించేదటంఊ ఆగ్రహం వ్యక్తం చేశారు..