రాష్ట్రపతి భవన్‌కు బిల్లు
నేడు టీ బిల్లుపై రాష్ట్రపతి చేవ్రాలు
రేపో మాపో పార్లమెంట్‌కు..
అసెంబ్లీ బిల్లునే స్వల్ప సవరణలతో పార్లమెంట్‌లో..
సుష్మ, అరుణ్‌జైట్లి, వెంకయ్యతో కాంగ్రెస్ రహస్య మంతనాలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆదివారం రాష్ట్రపతి భవన్‌కు చేరింది. సోమవారం ఈ బిల్లుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేయనున్నట్టు జాతీయా మీడియా ప్రత్యేక కథనాలు వెలువరించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై జీవోఎం రూపొందించిన బిల్లును గతంలో పరిశీలించిన రాష్ట్రపతి దానిపై న్యాయసలహా తీసుకున్న మీదట ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, మండలి అభిప్రాయం కోసం పంపిన విషయం తెలిసిందే. చర్చకు తొలుత ఆరు వారాల గడువిచ్చిన రాష్ట్రపతి, ఆ తర్వాత ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు మరో వారం గడువు పెంచారు. డిసెంబర్ 13న రాష్ట్రపతి నుంచి బిల్లు రాష్ట్రానికి రాగా, జనవరి 30వ తేదీతో ముసాయిదాపై చర్చ ముగిసింది. ఫిబ్రవరి 3న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి బిల్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖకు అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్‌కు చేరిన విషయం తెలిసిందే. అనేక తర్జనభర్జనలు, సీమాంధ్ర నేతల అడ్డంకులు, మద్దతుపై బీజేపీ ఊగిసలాటలతో పార్లమెంట్‌కు చేరుతుందా లేదా అనే విషయమై అనేక ఊహాగానాలు సాగాయి. సీమాంధ్ర మీడియా దీనిపై విష ప్రచారమే సాగించింది. సీమాంధ్రుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న జీవోఎం స్వల్ప సవరణలో తుది బిల్లు సిద్ధం చేసింది. ఈ బిల్లుకు శుక్రవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. శనివారమే రాష్ట్రపతి భవన్‌కు బిల్లు పంపుతారనే ఊహాగానాలు సాగినా రాష్ట్రపతి రాజధానిలో లేకపోవడంతో ఆదివారం బిల్లును పంపింది. తెలంగాణ బిల్లును సోమ, మంగళవారాల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టానలి సిఫార్సు చేసూ ఫైలును ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి పంపించినట్లు ¬ం మంత్రిత్వశాఖ అధికారులు ఆదివారం రాత్రి వెల్లడించారు. రాష్ట్రపతి నుంచి ఆమోదాన్ని సోమవారం ఆశిస్తున్నామన్నారు. బిల్లును మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలనేఆలోచనలో ఉన్నాం” అని ¬ం మంత్రిత్వశాఖ ఉన్నతాధికారి ఒరు పిటిఐ వార్తాసంస్థకు చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ తిరాస్కారానిన తోసిరాజన్నట్లుగా కేంద్ర కేబినెట్ శుక్రవారం తెలంగాణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. అంతకుమునుపు బిల్లును సోమవారం రాజ్యసభలో ప్రవేశపెడతారనే చర్చ పార్లమెంటరీ వర్గాల్లోచోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటుగా సీమాంధ్ర ఎంపీలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బిల్లుపై తన ప్రణాళికను ప్రభుత్వం ఇప్పటిదాకా వెల్లడించలేదు. బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడం ద్వారా ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి పూర్తయిన తర్వాత కూడా దాన్ని సజీవంగా ఉంచాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. వివాదాస్పద బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపించిన రూపంలోనే ప్రవేశపెడతారు. సభలో పరిగణనలోకి తీసుకున్నప్పుడు ప్రభుత్వం దానికి 32 సవరణలు ప్రతిపాదించవచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.