అనుమానాలొద్దు
టీ బిల్లు ఆమోదం పొందుతుంది : షిండే
ముంబయ్, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) :
తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో కచ్చితంగా ఆమోదం పొందుతుందని కేంద్ర ¬ం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. ఆ వి శ్వాసం తమకు ఉందని అన్నారు. తెలంగాణ సమస్య ఎప్పటి నుంచో ఉందని అన్నారు. ముంబయ్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా
గాంధీ ఇచ్చిన మాటను నెరవేరుస్తామని చెప్పారు. అక్కడి ప్రజల చిర కాలవాంఛ నెరవేరబోతోందని అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో గురువారం పార్లమెంటులో జరిగినటువంటి సంఘటనకు చూడలేదని చెప్పారు. ఎంపీలు ఇంతగా తెగిస్తారని అనుకోలేదన్నారు. అయితే ఈ వ్యవహారంలో ఎంపీలపై చర్య తీసుకునే అంశం స్పీకర్ పరిధిలో ఉందన్నారు. దీనిని స్పీకర్ పరిశీలిస్తున్నారని చెప్పారు. తప్పకుండా వారిపై చర్య ఉంటుందన్నారు.