ఒపీనియన్ పోల్స్‌లో పారదర్శకత లేదు:కేజ్రీవాల్
హైదరాబాద్: ఎన్నికల ఒపీనియన్ పోల్స్‌లో పారదర్శకత ఉండడం లేదని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద కేజ్రివాల్ పేర్కోన్నారు. ఢిల్లీలో ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఒపీనియన్ పోల్స్‌లో పారదర్శకత ఉండడంలేదని ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఒపీనియన్ పోల్స్ పలితాలను మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. అసత్య ఒపీనియన్ పోల్స్‌తో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఒపీనియన్ పోల్స్‌పై ప్రత్యేక నియంత్రణ విభాగం ఏర్పాటు చేయాలని ఆప్ నేత యోగేంద్ర యాదవ్ ఎన్నికల సంఘన్ని కోరారు.