ఆర్థికశాఖ అధికారులతో ముగిసిన గవర్నర్‌ సమీక్ష

హైదరాబాద్‌: ఆర్థికశాఖ అధికారులతో గవర్నర్‌ నరసింహన్‌ సమీక్ష సమావేశం ముగిసింది.ఎక్సైజ్‌ రిజిస్ట్రేషన్‌, మైన్స్‌, రవాణా శాఖ ఆదాయాలపై దృష్టి సారించాలని ఆర్థిక శాఖ అధికారులకు గవర్నర్‌ ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన మరో రూ.39 కోట్లను రాష్ట్రానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఆదాయం రూ.79 కోట్లు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ అధికారులకు ఆదేశించారు.