సాయంత్రంలోగా రెండు పీసీసీలు?

న్యూఢిల్లీ : సోమవారం సాయంత్రంలోగా కాంగ్రెస్‌ అధిష్టానం రెండు పీసీసీలు ప్రకటించే అవకాశం ఉంది. సీమాంధ్రలో బొత్స సత్యనారాయణను పీసీసీ అధ్యక్షునిగా కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి సామాజిక వర్గాల ఆధారంగా జాబితా తయారు చేసినట్లు తెలుస్తోంది. సోనియా, రాహుల్‌ ఆమోద ముద్ర పడగానే జాబితా వెలువడే అవకాశం ఉంది.