రాష్ట్రాన్ని అభివృద్థి పరచింది చంద్రబాబే: తలసాని
రాష్ట్రాన్ని అభివృద్థి పరచింది చంద్రబాబే: తలసాని
హైదరాబాద్: రాష్ట్రాన్ని అభివృద్ది చేసింది తెదేపా పార్టీ అధినేత చంద్రబాబేనని ఆపార్టీ నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో బలహీనవర్గాలను ఆదుకోవాలంటే తెదేపా రావాల్సిందే అని అన్నారు. సీఎం అభ్యర్థి ఎవరవేరి పార్టీ అధినాయకత్వ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటామన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో అందరి నిర్ణయం తీసుకునే అలవాటు చంద్రబాబుదని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట మార్చారని శ్రీనివాస్‌యాదవ్ ఆరోపించారు.