తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే!
హైదరాబాద్, మార్చి 20 (జనంసాక్షి) :
తమ్ముడు తమ్ముడేనని.. పేకాట పేకాటేనని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నా రు. పవన్ కల్యాణ్ ఇం ట్లో తనకు తమ్ముడైనా రా జకీయాల్లో మాత్రం ప్ర త్యర్థేనని ఆయన తేల్చిచె ప్పారు. పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు సభలో కాంగ్రెస్ హఠావో.. దేశ్‌కో బచావో అని పిలుపునివ్వడంపై ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్నారు. కాంగ్రెస్‌ను అది చేస్తాం.. ఇది చేస్తాం.. భూస్థాపితం చేస్తాం.. తుంగలో తొక్కుతాం.. బొంద పెడతాం.. అవన్నీ వట్టి మాటలేనని కొట్టిపారేశారు. 127 ఏళ్ల పార్టీ ఇలాంటివెన్నో చవి చూసిందని అన్నారు. పెద్ద జాతీయ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరు. ఏదో ఒకటిరెండు రాష్ట్రాల్లో ప్రతికూలత ఉండొచ్చు.. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పవన్ ఆలోచనలు.. ఉద్వేగాలు ఆయన సొంతం. ఆయన్ను అన్నగా ఆశీర్వదిస్తా.. ఆయన అభిప్రాయాలను, ఆయన మార్గాన్ని కట్టడి చేయలేను. ఏదో భావోద్వేగంతో అలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నాను. తమ్ముడిగా పవనకు తన ఆశీస్సులు ఉంటాయి.. రాజకీయంగా మాత్రమే ప్రత్యర్ధిని అని అన్నారు. పవన్ లాంటి తమ్ముళ్లు తనకు లక్షల సంఖ్యలో ఉన్నారు. కెసిఆర్ బెదిరింపులకు భయపడబోం. బెదరబోం.. సీఎం అభ్యర్ధి ఎవరన్నది ఎన్నికల తర్వాతే సీఎల్‌పి నిర్ణయిస్తుందని చెప్పారు. రాష్ట్ర విభజన తప్పు అంటే.. ఆ తప్పు అందరిదీ అన్నారు. తెలంగాణాకు అనుకూలమని అన్ని పార్టీలు చెప్పాకే కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకున్నదని అన్నారు. తెలంగాణా ఇచ్చి తన మాటను నిలబెట్టుకుంది. కొన్ని పార్టీల అధినేతలు యూ టర్న్ తీసుకుని కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారు. రాజకీయ లబ్ధిపొందేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.