కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌ నేత సంజీవరెడ్డి కిడ్నాప్‌

కరీంనగర్‌ జనంసాక్షి: జిల్లాలోని కోరుట్ల మండలం ఐలాపూర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుడు సంజీవరెడ్డి శుక్రవారం రాత్రి కిడ్నాప్‌కు గురయ్యారు. స్థానిక ఎన్నికల నేపధ్యంలోనే ప్రత్యర్ధి వర్గాలు ఈ కిడ్నాప్‌కు పాల్పడి ఉంటారని ఆరోపిస్తూ సంజావరెడ్డి బంధువులు కోరుట్ల పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ఇంత వరకు పోలీసులు చర్య తీసుకోకపోవడంపై టీఆర్‌ఎస్‌ నేత విద్యాసాగర్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.