బాబు ను ఢిల్లీకి ఆహ్వానించిన‌ బీజేపీ, తిరస్కరించిన‌ బాబు

 హైదరాబాద్, ఏప్రిల్ 6 : టీడీపీ-బీజేపీ పొత్తుపై అధికారిక ప్రకటన కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును భారతీయ జనతా పార్టీ నేతలు ఆదివారం ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో తాను ఢిల్లీ రాలేనని బీజేపీ నేతల అహ్వానాన్ని చంద్రబాబు నాయుడు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

దీంతో ఈ విషయంపై ఆదివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్ సింగ్ చంద్రబాబుతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపే అవకాశముందని తెలియవచ్చింది. కాగా బీజేపీ-టీడీపీ మ«ధ్య పొత్తుల గురించి ఎప్పటినుంచో వస్తున్న ఊహాగానాలకు ఆదివారం తెరపడే అవకాశముందని, రెండు పార్టీల మధ్య పొత్తులు కుదిరినట్లు తెలియవచ్చింది. ఈ రోజు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.