చిక్కుముడి వీడనుందా..?
జనంసాక్షి : మలేషియా మిస్టరీ ప్లేన్ మిస్సింగ్ చిక్కుముడి వీడనుంది…మలేషియా ఎయిర్ లైన్స్ జెట్ లైనర్ బ్లాక్ బాక్స్ నుండి వస్తున్నాయని భావిస్తున్న పింగ్ సిగ్నల్ ని చైనా నౌకతో పాటు ఆస్ట్రేలియా నౌక కూడా గుర్తించింది. దాంతో అన్వేషణ కొనసాగిస్తున్న పలుదేశాల టీంలు ఆదిశగా అడుగులు వేస్తున్నాయి… ప్రత్యేకంగా తెప్పించిన సబ్మెర్సిబుల్ యంత్రాలతో కూడా అన్వేషణ కొనసాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ రోజుకు సరిగా నెల క్రితం సిబ్బంది సహా 239 మంది ప్రయాణికులతో అదృష్యమైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం బ్లాక్ బాక్స్ గుర్తింపుతో కొలిక్కిరానుందని తెలుస్తోంది. బ్లాక్ బాక్స్ బ్యాటరీ వ్యవస్థ నిర్వీర్యమయ్యే దశలో చైనా నౌక, ఆ సిగ్నల్స్ ని పసిగట్టింది. ఆదినుండి అనుమానాస్పద ప్రకటనలు చేస్తోన్న మలేషియా, తాజాగా మరో ప్రకటన చేసింది. విమానం దక్షిణ హిందుమహా సముద్రంలో కూలిపోయి ఉండొచ్చని ప్రకటించింది.