చంద్రబాబు అవకాశవాది..
(జనంసాక్షి) :
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పచ్చి రాజకీయ అవకాశవాది అని సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరీ విమర్శించారు. .. గోద్రా అల్లర్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మూలకారణమని గతంలో ఆరోపించిన చంద్రబాబు.. ఇపుడు అదే నరేంద్ర మోడీతో జతకట్టడం ఆయన రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమన్నారు. మోడీని ప్రధాని చేయాలని చంద్రబాబు పిలుపునివ్వడం సరికాదన్నారు. అయితే, చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరని, బీజేపీతో టీడీపీ పొత్తును ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు.