బీసీసీఐకు సుప్రీం షాక్

(జ‌నంసాక్షి) :

ఐపీఎల్ పై దర్యాప్తు ప్రారంభించిన బిసీసీఐ కు సుప్రీం షాకిచ్చింది. ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ స్కామ్ కు సంబంధించి జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ ముందు భారత కెప్టెన్ ధోనీ, ఎన్.శ్రీనివాసన్, ఐపీఎల్ సీఓఓ సుందర్ రమణ్ లు ఇచ్చిన ఆడియో రికార్డులను పరిశీలించేందుకు బీసీసీఐ సుప్రీంకోర్టును కోరగా అందుకు సుప్రీం తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్ ఏకే పట్నాయక్, జస్టిస్ జేఎస్ ఖెహార్ ఆధ్వర్యంలోని బెంచ్ తీర్పునిచ్చింది. ఐపీఎల్ స్కాం సంబంధించిన ఆడియో రికార్డింగులను తామే తీసుకుని పరీశీలిస్తామని బీసీసీఐ న్యాయవాదులకు చెప్పారు. అనంతరం విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు