శోభ మృత దేహానికి రేపు అంత్యక్రియలు

హైదరాబాద్(నెట్‌డెస్క్): రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి అంత్యక్రియలు రేపు ఆళ్లగడ్డలో జరగనున్నాయి. నేత్ర దానం అనంతరం ఆమె మృత దేహాన్ని తరలించేందుకు బంధువులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు శోభ మృత దేహాన్ని సందర్శనార్థం నంద్యాలలో ఉంచనున్నారు. రేపు 12 గంటలకు ఆళ్లగడ్డలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.